28/03/2026
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కార్ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బస్సు కిందికి దూసుకెళ్లిన కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు—శ్రీధర్ రావు, లక్ష్మి, నాలుగేళ్ల ఆద్విక మృతి చెందారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, బెంగళూరు నుంచి తిరుమలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.