Tollywood Movie Review's -Ramesh

Tollywood Movie Review's -Ramesh Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Tollywood Movie Review's -Ramesh, Cinema, Hyderabad.

SAME FeelingPost credit goes to త్రినాధరావు గరగ గారు.బింబిసార మూవీ రివ్యూ..జ‌యాప‌జ‌యాలతో సంబంధం లేకుండా .. కొత్త దర్శకుల...
01/09/2022

SAME Feeling

Post credit goes to త్రినాధరావు గరగ గారు.

బింబిసార మూవీ రివ్యూ..
జ‌యాప‌జ‌యాలతో సంబంధం లేకుండా .. కొత్త దర్శకులను పరిచయం చేస్తూ హీరో నందమూరి క‌ళ్యాణ్ రామ్ చేసిన మ‌రో కొత్త ప్ర‌య‌త్న‌మే బింబిసార మూవీ.

ఫాంటసీ, టైం ట్రావెల్ సినిమాగా తెరకెక్కిన బింబిసారలో కథని నమ్మి పెట్టిన ఖర్చులో ఏ ఒక్క పైసా కూడా ఈ సినిమాకి వృధా కాలేదు.నిజంగా బింబిసార వంటి సినిమాను ఓ కొత్త ద‌ర్శ‌కుడిని న‌మ్మి చేసినందుకు క‌ళ్యాణ్ రామ్‌, నిర్మాత హ‌రికృష్ణ‌లను ఖచ్చితంగా అభినందించాల్సిందే.

దర్శకుడు వశిష్ట్ తన డెబ్యూ చిత్రంతోనే తన సత్తా ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా బాహుబలి స్ఫూర్తితో వీఎఫ్ఎక్స్ అక్కడక్కడా కొంచెం పేలవంగా ఉన్నా టోటల్గా ఆకట్టుకుంటాయి. ఇక రాజమౌళి, రాఘవేంద్రరావు సినిమాలకు మాత్రమే మంచి సంగీతాన్ని అందించే కీరవాణి తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాను వేరే లెవెల్ కి తీసుకెళ్ళాడు.

చిరంతన్ భట్ పాటలు పరవాలేదు.చోటాకేనాయుడు తన సినిమాటోగ్రఫీతో అద్భుతమైన విజువల్స్ చూపించారు. కిరణ్ కుమార్ మన్నే ఆర్ట్ డైరెక్షన్ టీం వర్క్ బాగుంది. అలాగే డైలాగ్స్ అందించిన వాసుదేవ్ సాలిడ్ వర్క్ అందించారు. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ తో పలికించిన డైలాగ్స్ బాగున్నాయి.

ఇంకా ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ కూడా ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లీన్ గా ఉంది.ఈ చిత్రంలో కాస్త బాగా కనిపించే మైనస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే విలన్ పాత్ర..ఇంకొంచెం విలన్ పాత్రను డిజైన్ చేసుకుంటే బాగుండేదేమో కొన్ని సీన్లు, విజువల్స్‌ ఇతర సినిమాల్లో చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది.

అలాగే సెకండాఫ్ లో కొంచెం సినిమా అక్కడక్కడా నెమ్మదించినట్టు అనిపిస్తుంది. అలాగే కళ్యాణ్ రామ్ పాత్రని పలు సందర్భాల్లో మరింత డ్రామా క్రియేట్ చేయడానికి ఆస్కారమున్నా అది మిస్సయ్యింది. హీరోయిన్స్ విషయానికి వస్తే వారికి కూడా పెద్దగా స్కోప్ ఉన్నట్టు కనిపించదు. ఏదో కొన్ని సీన్స్ లో ఉండాలి అన్నట్టు ఉంటారు.

సంయుక్త మీనన్ రోల్ అయితే అంత ఎఫెక్టీవ్గా కనిపించదు.సినిమా చూస్తున్నంత సేపు బాగానే ఉంటుంది. కానీ థియేటర్ నుండి బయటకు వచ్చాక… ఏం చూశామో, ఆ సంఘటన ఎందుకు అలా జరిగిందో చెప్పలేని పరిస్థితి అయితే ఉంటుంది.

ఈ సినిమాకు సంబంధించి ఓ గొప్ప విషయం ఏమిటంటే… దర్శకుడు ఇలాంటి ఓ భారీ కథను చాలా సింపుల్ గా నడిపించడం నిజంగా గ్రేటే. రన్ టైమ్ తక్కువ ఉండటం కూడా బింబిసారకు ఓ వరం అని చెప్పొచ్చు.. ఈ వీకెండ్ లో సరదాగా ఎంజాయ్ చేస్తూ సినిమా చూసేయ్యొచ్చు.

కార్తికేయ..కొంచెం కాలకేయ లా మొదట్లో (ఫస్ట్ హాఫ్) లాజిక్ లేమి లేకుండా మందంగా ఉన్నా ఆ తరువాత(సెకండ్ హాఫ్) బాహుబలి అంత బలంగ...
14/08/2022

కార్తికేయ..

కొంచెం కాలకేయ లా మొదట్లో (ఫస్ట్ హాఫ్) లాజిక్ లేమి లేకుండా మందంగా ఉన్నా ఆ తరువాత(సెకండ్ హాఫ్) బాహుబలి అంత బలంగా ఉంది.

సంపత్ అలాగే అనుపమ్ కేర్ గారి ప్రతిభను ఇంకా బలంగా వాడుకోలేదేమో అన్నట్టు అనిపించింది.

శ్రీ కృష్ణుడు నడయాడిన నేల ద్వారకా రహస్యం (కాల గర్భంలో కలిసి పోయిన శ్రీ కృష్ణ జన్మస్థలం యొక్క రహస్యం ఛేదించి ఈ కథలో వ్యక్తపరుస్తారు అనే ఒక ఊహతో సినిమా చూడటానికి వెళ్ళాను కానీ మన ఊహలకు అందని కథను డైరెక్టర్ రెడీ చేసి కమర్షియల్ హంగులు జతచేసి ప్రేక్షకులను అయితే నిరాశ పరచలేదు.

అందుకు కారణం మధ్య మధ్యలో శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష కొన్ని సందర్భాల్లో బలమైన సందర్భానుసారంగా నవ్వులు పూయించారు.

ఇక As Usual గా నిఖిల్ నటన టైమింగ్ బాగున్నాయి.

కథను నీటుగా క్యారెక్టర్స్ కి తగ్గట్టు Mould చేసుకున్నారు గాని వారి నుంచి రావాల్సిన నటనను మాత్రం పూర్తి స్థాయిలో రాబట్ట లేక పోయారనే చెబుతాను.

హీరోయిన్ మైనస్ ఇక ఇంతకంటే ఏమ్ మాట్లాడలేను.

హీరో తల్లి క్యారెక్టర్ చాలా బాగుంది బాగా నటించారు.

గ్రాఫిక్స్ పర్లేదు... సెకండ్ హాఫ్ లో కథలో లీనం అయిపోతాం ఇంకా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వాడాల్సి ఉండేది అనిపిస్తుంది.

సినిమా థియేటర్లలో రెండు మూడు సందర్భాల్లో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

సినిమా బాగుంది overall గా చూసుకుంటే. Worthy

Background Music మాత్రం చాలా బాగుంది.


08/05/2022

ఈ మధ్య సరికొత్త వివాదంతో బుల్లితెర మీద కూడా పాపులర్ అయిన విశ్వక్సేన్ లేటెస్ట్ మూవీ అశోకవనంలో అర్జున కళ్యాణం.. సినిమాలో సరుకుంటే వివాదాలు అసలు కనపడవని ఈ సినిమాతో మనకు అర్థమవుతుంది. పైగా ఒక కొత్త విశ్వక్సేన్ ఈ సినిమా ద్వారా మనకు పరిచయం అవుతాడు. సెకండాఫ్ కొద్దిగా లాగ్ అనిపించినా సినిమా మొత్తంగా చూస్తే బండిని బానే లాక్కొచ్చేసారు అనిపిస్తుంది.లాక్ డౌన్ కాన్సెప్ట్ మీద ఇప్పటికే చాలా సినిమాలు ఓటిటీల్లో చూసేసారు జనం. అక్కడక్కడా సత్య వివాహభోజనంబు ఛాయలు కనిపించినా విశ్వక్సేన్ పర్ఫామెన్స్, మేనరిజమ్స్, ఎమోషన్స్ తో దర్శకుడు విద్యాసాగర్ పాస్ అయ్యాడు. ముఖ్యంగా కన్ఫ్యూజన్ లో ఉన్న పెళ్ళికాని ప్రసాదులకు ఈ సినిమాలో ఇచ్చిన క్లారిటీ అందరూ మెచ్చే విధంగా ఉంది.కొన్ని సన్నివేశాలు నవ్విస్తాయి. కొన్ని మన మనసుకు హత్తుకుంటూయి. అర్జున్ కుమార్ అల్లం పాత్రలో మాత్రం విశ్వక్ సేన్ ఒదిగిపోయారు. మందు తాగిన తర్వాత వచ్చే సన్నివేశంలో గోపరాజు రమణ, విష్వక్ సేన్ నటనకు ప్రేక్షకుల మదిలో మంచి మార్కులు పడతాయి. మూడు పదుల వయసు దాటినా పెళ్లి కాని అబ్బాయిల పరిస్థితిని నటనలో విశ్వక్ సేన్ చక్కగా చూపించారు. బయట హుషారుగా కనిపించే విశ్వక్ ఈ సినిమాలో అండర్ ప్లే చేశారు.రాజావారు రాణివారు దర్శకుడు రవి కిరణ్ కోలా కథలో కామన్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయి. తెలంగాణ అబ్బాయి గోదావరి అమ్మాయికి నిశ్చితార్థం నేపథ్యంలో కొన్ని బలమైన సన్నివేశాలు దర్శకుడు రాసుకొంటే ఇంకా బాగుండేది. కాదంబరి కిరణ్ కుమార్ను మాత్రమే వాడుకున్నారు.కొన్ని సన్నివేశాల్లో భావోద్వేగాన్ని ఆర్ఆర్ డామినేట్ చేసింది.సినిమాటోగ్రఫీ బావుంది. సినిమాలో ఎక్కువ భాగం ఓకే ఇంట్లో జరిగినా... ఆ ఫీల్ రానివ్వకుండా చూసుకున్నారు. మధ్య మధ్యలో గోదావరి అందాలను బాగా తెరకెక్కించారు. ప్రొడక్షన్ డిజైన్ బావుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే రుక్సార్ పర్వాలేదు.రుక్సార్ చెల్లెలు పాత్రలో నటించిన రితికా నాయక్ థియేటర్ నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులకు గుర్తు ఉంటుంది చూపులకు పక్కింటి అమ్మాయిలా ఉంటుంది. అయితే... ఆమె క్యారెక్టరైజేషన్, ఆ పాత్రలో రితికా నాయక్ నటన ఆకట్టుకుంటుంది. మొత్తానికి ఈ సినిమాలో క్యారెక్టర్లన్నీ నిజజీవితంలో మనం ఎక్కడో చూసిన పాత్రల్లా ఉంటాయి.ఓవరాల్ గా చెప్పాలంటే... రెండున్నర గంటలు కాస్త మనసుకు ఆహ్లాదాన్ని పంచే సినిమా అశోక వనంలో అర్జున కళ్యాణం. గొప్ప కధేమీ లేకపోయినా , కాసేపు మనల్ని.. మన చుట్టుపక్కల చూసిన సంఘటనలను తెరపై చూసినట్టు ఉంటుంది.. ఈ వీకెండ్లో ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా అని నిరభ్యంతరంగా చెప్పొచ్చు.

"Destiny Can Redable can't interuptable" నాకు నచ్చిన అత్యంత రియలిస్టిక్ గ ఉన్న మాట..✍️రాధే శ్యామ్ గురించి మాట్లాడే ముందు...
16/03/2022

"Destiny Can Redable can't interuptable" నాకు నచ్చిన అత్యంత రియలిస్టిక్ గ ఉన్న మాట..

✍️రాధే శ్యామ్ గురించి మాట్లాడే ముందు హస్త సాముద్రికం గురించి తెలుసుకుందాం....

✍️పురాణాలు ఉపనిషత్తులు తిరగేస్తే హస్త సాముద్రికం యొక్క గొప్పతనం అలాగే గ్రహాల అనుకూలతలు వాటి సారాంశం ఏమిటో మనకు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికున్న ప్రాముఖ్యత మనకు అర్థం అవుతుంది.

✍️ప్రస్తుతం Passion గా హస్త సాముద్రికం తో పాటు గ్రహాలను అనుసరించి ఖగోళ శాస్త్రం ద్వారా మనకు ఉన్న గ్రహ ప్రభావం, తిథి వార నక్షత్ర ప్రభావం గురించి తెలిపే వారిని వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు ప్రపంచంలో....

✍️నాకు తెలిసిన అత్యంత ప్రతిభావంతులైన Pamist & Astrology guru ఒక్కరే ఒక్కరు వారే Balu Munnangi అన్న. ఇటువంటి ఇంకా తెలియని, తెలియకుండా ఉండని స్టోరీస్ ఎన్నో ఉండొచ్చు మన చుట్టూ కానీ ఈ సినిమా చూస్తున్నంతసేపు కొన్ని సందర్భాల్లో #బాలు_మున్నంగి గారు వాస్తవంగా కనిపించిన సందర్భాలు.

✍️నాతో పాటు సినిమా వచ్చిన నా అర్థాంగి తో ఇదే మాట చెప్పా He is a Legend in హస్త సాముద్రికం మరియు ఆస్ట్రాలజీ లో గురూ అని, సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగి తనకి అత్యంత ఇష్టమైన సబ్జెక్ట్ మీద పట్టు వీడని విక్రమార్కుడిలా కష్టపడి జ్ణానం సంపాదించి ఇప్పుడు తనని కలవాలనీ తనని కలిసి వారి భవిష్యత్తు ఏంటో తెలుసుకోవాలనీ తపన పడే సినిమా ఇండస్ట్రీ వారు, పొలిటికల్ లీడర్స్, పోలీస్ అఫీసియల్స్, డాక్టర్లు ఇలా ఎందరో క్యూ కడుతున్నారు అని చెప్ప....

✍️బాలు గారి ఫేస్బుక్ లేదా తన వెబ్ సైట్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉంటే అర్థం అవుతుంది తనేంటీ తాను ఏంటి అన్నది. అలాగే అర్థం అయిన మనిషి నాకు వారు.

@@@@@@@@@@@@@@@@@@@@@@
"రాధే శ్యామ్ లో కొన్ని సందర్భాల్లో బాలు గారు మనసుకు కనిపించిన సందర్భాలు"

✍️కృష్ణం రాజు గారు మొదట ఒక సీన్ లో చెప్తారు విక్రమాదిత్య (ప్రభాస్) "Einstein of Palmistory" అంటాడు అక్కడ ప్రభాస్ ని స్క్రీన్ పై చూస్తున్నప్పుడు కృష్ణం రాజు గారి మాట విన్నప్పుడు మనసులో ఒక విజిల్ వేసి "బాలు మున్నంగి" అన్ననే ఊహించుకున్న..

✍️ Palmistry is 99% Science అంటూ ఈ 99% పర్సెంట్ వారి జీవితం చెప్పినట్టు ఉంటుంది, చెప్పినవి జరుగుతాయి, వాటిని ఫాలో అవుతూ జాగ్రత్తగా ఉంటారు అంటు కృష్ణం రాజు ప్రభాస్ తో చెప్పినప్పుడు, ప్రభాస్ అప్పుడు మరి మిగితా 1% Percent ఏంటి అని అడగ్గ ఆ 1% Percent వాళ్ళు మాత్రం వాళ్ళ రాతను వాళ్ళే రాసుకుంటారు అని చెప్పినప్పుడు. ఇది ఎందుకు చెప్పాను అంటే Astrology Scientist బాలు గారు గ్రహాల అనుకూలతలను బట్టి ఆరోగ్య భద్రత గురించి చెప్పినప్పుడు వాటిని ఫాలో అవుతూ వారి కస్టమర్స్ జాగ్రత్తగా ఉంటారనీ అనిపించింది అలా ఉండటం ద్వారా నే కదా వారు ఇంత ఫేమస్ మరియు నిక్కచ్చిగా వారి శాస్త్రం ఉంటుంది అని అర్థం అయింది.

✍️ఇక మూడో సంఘటన ప్రేరణ (పూజా హెగ్డే) పెదనాన్న ప్రభాస్ యొక్క టాలెంట్ ని కనిపెట్టడానికి తన హాస్పిటల్ లోని ఒక ఐదుగురి (నిర్జీవంగా పడిఉన్న వారి) యొక్క హస్త సాముద్రికాలు పేపర్ లో ప్రింట్ చేసి తన ముందు ఉంచి వీరి భవిష్యత్తు ఏంటో చెప్పమంటాడు అందులో నలుగురు వివిధ కారణాల చేత చనిపోయారు. ఐదో వ్యక్తి ఒక గొప్ప డాక్టర్ ఆయన ఎలా ఎప్పుడు చనిపోతాడో మాత్రం చెప్పను అంటాడు. ఇదే విలువలు పాటించే వారి గొప్పతనాన్ని నిదర్శనం హస్త సాముద్రికం లో. ప్రకృతి కి విరుద్ధంగా నడుచుకోకూడదు అని. ఈ ఘట్టంలో కూడా మన బాలు మున్నంగి గారు గుర్తొచ్చిన సందర్భం. ఎందుకంటే ఈ మధ్యనే (ఆరు నెలల క్రితం)వారు ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు వివిధ వయసుల వారి (చనిపోయిన వారి)యొక్క కంప్లీట్ Date of birth & Place కోసం ఒక పోస్ట్ చేసారు.. అటువంటి వారు చనిపోవడానికి వారి గ్రహ స్థితి స్టడీ చేయడానికి పోస్ట్ చేసారు మరి ఇది ఎంతవరకు సక్సెస్ అయ్యిందో అంటే వారికి కావాల్సిన సమాచారం దొరికిందో లేదో...

@@@@@@@@@@@@@@@@@@@@@@@
ినిమా_విషయానికి_వస్తే

రాధే శ్యామ్ నిజంగా 90% బయటి దేశంలో లో కంప్లీట్ చేసి విజువల్స్ మాత్రం బ్రహ్మాండంగా ఆలోచించి మూవీ తీయడంలో యూనిట్ చాలా సక్సెస్ అయ్యారు.

-రాధే శ్యామ్ లో కథలో భాగంగా హీరోయిన్ కోసమే హాస్పిటల్ పెట్టినట్టు ఉంటుంది ఎందుకంటే 70% మూవీ ఒక హాస్పిటల్, ఆరోగ్యానికి సంబంధించిన విషయం చుట్టూ తిరుగుతూ ఉంటుంది.

మొదట్లో సైంటిస్ట్ లు వచ్చి కృష్ణం రాజు గారి దగ్గర కూర్చున్నప్పుడు సందర్భానుసారంగా వచ్చిన మాటల్లో మన శాస్త్రాలు వాటి పురాతన కొన్ని వేల సంవత్సరాల ముందు గొప్పతనం చెబుతాడు చేతి రాతల్లో మన ఫ్యూచర్ ఉంది అని చూపించి లాస్ట్లో మన రాతలు మనమే రాసుకొని ఆ 1% సక్సెస్ రేటు లో మనం ఉండాలి అని మంచి స్టోరీ లైన్ ని పండించారు.

✍️✍️ఇక నాకు తెలిసినంత వరకు స్త్రీలకు ఎడమ అరచేతి రేఖలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు ఎవరైనా హస్త సాముద్రికం వారి గురించి చెప్పాలంటే. ఇక్కడ ఈ సినిమా లో ఎవరి రేఖలు (లింగ బేధం లేదు) చూసిన కుడి చేతి రేఖలను మాత్రమే చూస్తూ కొంతమెర కన్ఫ్యూజన్ అయితే క్రియోట్ చేసారు డైరెక్టర్ గారు ఈ విషయం గురించి అవగాహన ఉన్నవారికి మాత్రమే తెలుస్తుంది అది ఎంత పెద్ద పొరపాటు అనేది.

ఈ స్టోరీ లైన్ లో ముందుగానే జాతకం తెలిసిన మన పాత్రధారులు ఎలా వల్ల తలరాతను ఎదిరించి కలిసారో మనం ఫైనల్ లో చూస్తాం.

Peacefull గా ఒక classic Love story and drama హీరో హీరోయిన్ మధ్య నడుస్తుంది ప్రభాస్ కెరీర్లోనే top classic Love story.

జగపతిబాబు తన పరిధి లో తాను అద్భుతంగా నటించారు, హీరో మదర్ క్యారెక్టర్ సెట్ అవ్వలేదు అలాగే హీరో ఫ్రెండ్ అతనెవరో గాని literally కామెడీ పీస్ లా ఉన్నాడు అంత వయస్సు భారీ దేహం పెట్టుకొని హీరో మదర్ ని ఆంటి ఆంటి అంటుంటే కొన్ని సందర్భాల్లో నువ్వు వొచ్చింది ఇంకొన్ని సందర్భాల్లో పట్టించుకోలేదు 😜 పోనిపో క్యారెక్టర్ సెట్ చేసిన డైరెక్టర్ కి తెలిసి ఉండాలి కదా ఎవర్ని ఎలా పిలవాలి వారి బాడీ లాంగ్వేజ్ ఏంటి అని.

#నోట్: దయచేసి ఇటువంటి పెద్ద సినిమాలు థియేటర్ వెళ్ళి చూసి ఆనందించండి. చాలా బాగున్నాయి పాటలు అలాగే విజువల్స్, లోకేషన్స్, స్టోరీ కూల్ గా వెళ్తుంది... ఇంకా ప్రభాస్ కి Palmistry పైన ఆ మక్కువ ఎలాగ వచ్చింది అని కొంచెం నిడివి పెంచి అలాగే సముద్రం లోకి షిప్ రెండు నిమిషాలు ప్రయాణం చేయగానే తుపాను మరియు భూకంపం అదేందో కొంచెం నిడివి ఇక్కడ పెంచి విజువల్స్ ఇంకా బాగా చూపించి ఉండవచ్చు.

ఏది ఏమైనా ప్రభాస్ గారి మువీ చాలా కొత్తగా ఉంది ముఖ్యంగా ఈ మువీ చూస్తున్నంతసేపు astrology guru, Palmistry specialist బాలు అన్న నే గుర్తు వచ్చారు...

కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా ప్రభాస్ సినిమా ఈ రేంజిలో ఉండాలి ఆ రేంజిలో ఉండాలి అని ఊహించుకొని వెళ్ళకుండా చూస్తే ఈ మువీ లాగా ప్రభాస్ మరేది చేయలేడు అన్న విధంగా ప్రశాంతంగా ఉంటుంది స్టోరీ..




మన తెలుగు చిత్రం... "శ్యామ్ సింగ రాయ్"హీరో:నానిహీరోయిన్లు: సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్డైరెక్టర్ : రాహుల్...
29/12/2021

మన తెలుగు చిత్రం... "శ్యామ్ సింగ రాయ్"

హీరో:నాని

హీరోయిన్లు: సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్

డైరెక్టర్ : రాహుల్ సాంకృత్యాయన్

మ్యూజిక్: మిక్కీ జే మేయర్

స్టోరీ (రచన): జంగ సత్యదేవ్

అప్పటి అభ్యదయ కవి శ్యామ్ సింగారాయ్ గారు చెప్పిన రెండు మాటలు తూటాల్లా పేలాయి ఇందులో...

స్వార్థం గురించి ఒక మాట
1 "నీ ఇల్లు బాగుండాలనుకోడం
నీ స్వార్దం
ఈ ప్రపంచం బాగుండాలనుకోడం
నా స్వార్దం"

నక్సల్స్ తనని వాళ్ళతో కలవమన్నప్పుడు‌..
2.తూటా ఒకరికే సరిపోతుంది
కానీ అక్షరం లక్షలమందికి సమాధానం చెబుతుంది అన్నటువంటి మాటలు..

3. నీళ్ళ బావి దగ్గర ఒక సీన్ అమాంతం ఆకట్టుకుంది సమాజంలో ఇప్పటికీ అక్కడక్కడా కనపడే అసమానతలను కళ్ళకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్ గారు.

దేవదాసీలను చెరబట్టే విలన్ ని అంతమొందించి తన ఇంటి నుంచి బయటకు వచ్చి కలకత్తా చేరి రాయల్ ప్రెస్ లో ఉద్యోగం కోసం ప్రయత్నించి సఫలం అయ్యి ఆ తరువాత తన పెన్నుకు ఉన్న బలం ఏంటో దేశం అంతా తెలియజేస్తాడు..

తన సొంత కుటుంబం అంటే ఎంత ప్రాణమే తన ప్రాణాలు పోయేంతవరకూ తెలుసుకోలేము...

కృతి శెట్టి నటనా అభినయం ప్రేక్షకులను అమాంతం కట్టిపడేస్తుంది..

ఇక సాయిపల్లవి నటన, క్లాసికల్ డాన్స్ లు , అలాగే మడోనా కోర్టు సీను ప్రేక్షకులను అలరించిన సందర్భాలు..

ఇక ఈ సినిమాలో నానీని చూసినట్టు లేదు అప్పటి శ్యామ్ సింగ రాయ్ నుంచి చూసినట్టే ఉంది..

నాని మిత్రులుగా చేసిన ఇద్దరూ కొంచెం హాస్యం అయితే పండించారు...

టోటల్ గా సినిమా అంత బాగుంది.
ముఖ్యంగా దేవదాసి కాలంలోకి వాళ్ళు ఒకరకంగా కొన్ని కొన్ని చోట్ల పడుతున్న ఇబ్బందుల గురించి, బయటికి రాని విషయాల గురించి ఈ చిత్రం ద్వారా తెలిసింది.

నాని నటన సహజంగా, అలాగే సాయి పల్లవి నటన సినిమాకి హైలైట్ ఇద్దరూ ఒదిగిపోయారు...ఇలాంటి విభిన్న నేపథ్యం ఉన్న సినిమాలు ఇంకా రావాలి..

దయచేసి అందరూ సినిమా థియేటర్లలో కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం..

ఒక సందర్భంలో అయితే ఒక సీన్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది కానీ కథ డిమాండ్ అలా ఉండటం అక్కడి నుంచి స్టోరీ మలుపు తిరగడం ఉంటుంది...

కథని చక్కగా రైటర్ గారు బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసుకోవడం డైరెక్టర్ గారు అనుకున్న లెవెల్ కి మువీ చిత్రీకరించి సక్సెస్ అవ్వడం హర్షించదగ్గ విషయం...

4/5 రేటింగ్...

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని సినీ ఆణిముత్యాలు అటు నటులు కానివ్వండి చిత్రం తాలూకు కథ కానివ్వండి చూసింది చూసినట్టు ప్రేక్షక...
29/12/2021

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని సినీ ఆణిముత్యాలు అటు నటులు కానివ్వండి చిత్రం తాలూకు కథ కానివ్వండి చూసింది చూసినట్టు ప్రేక్షకులకు చేరవేసే మాధ్యమంగా ఉండాలనే తపన మన " Tollywood Movie Review's" ది.

Address

Hyderabad
500001

Website

Alerts

Be the first to know and let us send you an email when Tollywood Movie Review's -Ramesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category