24×7 Film News

24×7 Film  News 24×7 film news motto is to give the latest updates fast and first to page viewers

ఎగిరే ధిక్కార పతాకం కలేకూరి ప్రసాద్ జయంతి...పిడికెడు ఆత్మ గౌరవం కోసంనేను ఎప్పుడు పుట్టానో తెలియదు గానీవేల ఏళ్ళ క్రితం ఈ ...
25/10/2023

ఎగిరే ధిక్కార పతాకం కలేకూరి ప్రసాద్ జయంతి...

పిడికెడు ఆత్మ గౌరవం కోసం

నేను ఎప్పుడు పుట్టానో తెలియదు గానీ
వేల ఏళ్ళ క్రితం ఈ గడ్డ మీదే చంప బడ్డాను
‘పునరపి మరణం – పునరపి జననం’
నాకు కర్మ సిద్ధాంతం తెలియదు గానీ
మళ్ళీ మళ్ళీ మరణించిన చోటనే పుడుతున్నాను
నా దేశం ఈ దేశంలో కరిగిపోయి
గంగా సింధూ మైదానమైంది
నా కనుగుడ్లు కన్నీరై ద్రవిస్తే
ఈ దేశంలో జీవనదులు ప్రవహించాయి
నా సిరల నుండి జీవధాతువులు స్రవిస్తే
ఈ దేశం సస్య శ్యామలమై సిరులు కురిసింది
త్రేతా యుగంలో నేను శంభూకున్ని
ఇరవై ఏళ్ళ క్రితం నా పేరు కంచికచెర్ల కోటేశు
నా జన్మస్థలం కీలవేన్మని కారంచేడు నీరుకొండ
ఇప్పుడు కరుడుగట్టిన భూస్వామ్య క్రౌర్యం
నా గుండెల మీద నాగేటి కర్రులతో పచ్చ బొట్టేసిన పేరు చుండూరు
ఇక చుండూరు నామవాచకం కాదు సర్వనామం
ఇప్పుడు ప్రతి గుండె ఒక చుండూరు – రగిలే రాచ పుండూరు
నేను జన సమూహాల గాయాన్ని గాయాల సమూహాన్ని
తర తరాలుగా స్వతంత్ర దేశంలో అస్వతంత్రున్ని
అవమానాలకూ అత్యాచారాలకూ మాన భంగాలకూ చిత్ర హింసలకూ గురై
పిడికెడు ఆత్మ గౌరవం కోసం తలెత్తిన వాడిని
ధన మదాంధ కులోన్మత్తుల రాజ్యంలో
బతకడమే ఒక నిరసనగా బతుకుతున్న వాడిని
బతికి వున్నందుకు పదే పదే చస్తున్న వాడిని
నన్ను బాదితుడని పిలవకండి
నేను అమరుణ్ణి నేను అమరుణ్ణి నేను అమరుణ్ణి
లోకానికి సంపదను మిగిల్చేందుకు క్షామాన్ని మింగిన
గరళ కంటున్ని నేను
శీర్షాసనం వేసిన సూర్యోదయాన్ని
నిటారుగా నిలబెట్టేందుకు
సూర్యుని నెత్తి మీద ఈడ్చి తన్నిన వాడిని
రగిలే గుండె కొలిమిలో నినాదాలు కురిపిస్తున్న వాడిని
నాకు జాలి జాలి మాటలొద్దు కన్నీటి మూటలొద్దు
నేను బాదితున్ని కాను అమరుణ్ణి
ఎగిరే ధిక్కార పతాకాన్ని
నాకోసం కన్నీరు కార్చకండి – మీకు చాతనైతే
నగరం నడిబొడ్డున ఖననం చేయండి
జీవన రవళిని వినిపించే వెదురు వనాన్నై వికసిస్తాను
నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి
చరిత్ర పుటల్లోకి సుందర భవిష్యత్తునై పరివ్యాప్తిస్తాను
ఒక పెను మంటల పెనుగులాటనై
మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను…

Much Awaited Reveal from  ‘L’ is now “LADAAI” 🔥Exciting Days Ahead… This is your blood and sweat darling  let’s rockkkkk...
19/10/2023

Much Awaited Reveal from ‘L’ is now “LADAAI” 🔥
Exciting Days Ahead…
This is your blood and sweat darling let’s rockkkkkk

సందిగ్ధ స్థితిలో సమాధానం చెప్పగలిగేది పుస్తకం మాత్రమే... నమ్మకం లేకుంటే మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ జానర్ లో ఉన్న పుస్త...
18/09/2023

సందిగ్ధ స్థితిలో సమాధానం చెప్పగలిగేది పుస్తకం మాత్రమే... నమ్మకం లేకుంటే మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ జానర్ లో ఉన్న పుస్తకాలని చదివే ప్రయత్నం చేయండి, కొత్త దారి కనిపిస్తుంది...

ఈరోజు బుక్ మై షో లో టికెట్స్ బుక్ చేసుకొని చెమట పట్టకుండా థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూసే వాళ్లకి ఏం తెలుసు బాసు నీ గు...
21/08/2023

ఈరోజు బుక్ మై షో లో టికెట్స్ బుక్ చేసుకొని చెమట పట్టకుండా థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూసే వాళ్లకి ఏం తెలుసు బాసు నీ గురించి... క్యులో నిలబడి అలసిన కాళ్లకి, కౌంటర్ దగ్గర నలిగిన చేతికి, చెమటకి తడిచిన చొక్కాకి, ఇవ్వన్నీ దాటి తెరపై మెగాస్టార్ అని నీ పేరు చూడగానే వచ్చే చిరునవ్వు కీ తెలుసు నువ్వేంటో. వాటిని అడిగితే చెప్తాయి నువ్వేవరో.

బుకింగ్స్ చెప్పాల్సిన అవసరం లేదు, టికెట్ కౌంటర్ దగ్గర తెగి పడిన చొక్కా బొత్తాలు చెప్తాయి, నే సినిమా కలెక్షన్ల రేంజ్ ఏంటో.

మెగాస్టార్ గా మాకు పరిచయం అయినందుకు, థాంక్స్ ❤️

This Man  is getting ready with his next project “L”. Shoot your profiles to the mentioned mail I’d in the poster. మీకో ...
16/08/2023

This Man is getting ready with his next project “L”. Shoot your profiles to the mentioned mail I’d in the poster.

మీకో సీక్రెట్: కథ మస్త్ ఉంటది, మీ ఫొటోస్ వీడియోస్ సెండ్ చేయండి. సెలెక్ట్ అయితే మీ ఖాతాలో మంచి సినిమా పడినట్లే 🥰.

ప్రజలకి న్యాయం జరగని చోట ప్రభుత్వాలు ప్రశాంతంగా ఉండకూడదు- జపాటా
11/08/2023

ప్రజలకి న్యాయం జరగని చోట ప్రభుత్వాలు ప్రశాంతంగా ఉండకూడదు- జపాటా

నా జాతి నా వారసత్వాన్ని కొనసాగిస్తుందని నమ్మాడు... నిన్నూ నన్నూ కలిపే నమ్మాడు. దాన్ని ఒమ్ము చేసి ఒట్టిగా కూర్చుందామా... ...
07/08/2023

నా జాతి నా వారసత్వాన్ని కొనసాగిస్తుందని నమ్మాడు... నిన్నూ నన్నూ కలిపే నమ్మాడు. దాన్ని ఒమ్ము చేసి ఒట్టిగా కూర్చుందామా...

గుజరాత్ లో మొదలైందిమనది కాదు అనుకున్నాంఒడిశాలో మొదలైందిఅబ్బే మనదాక రాలేదు అనుకున్నాంమణిపూర్ లో మొదలైందిఅక్కడెక్కడో అనుకు...
02/08/2023

గుజరాత్ లో మొదలైంది
మనది కాదు అనుకున్నాం

ఒడిశాలో మొదలైంది
అబ్బే మనదాక రాలేదు అనుకున్నాం

మణిపూర్ లో మొదలైంది
అక్కడెక్కడో అనుకున్నాం

ఇప్పుడు హర్యానా అంటుకుంది
ఎక్కడో ఢిల్లీ పక్కన కదా అనుకుంటున్నాం

మనదాక వచ్చాక మాట్లాడేందుకు ఎవరూ మిగల్రేమో…

రేపు తగలబడేది మన ఇల్లే…

From


ప్రజలని విడదీసి కొట్టుకునేలా చేసే కొత్త కుట్ర మొదలయ్యింది...

అగ్నిపరీక్ష చేయించిన రాముడిని సీత ప్రశ్నించలేదు...జూదంలో తనని ఓడిన పాండవులను ద్రౌపదీ నిందించలేదు...పరాయి ఆడదాన్ని అపహరిం...
21/07/2023

అగ్నిపరీక్ష చేయించిన రాముడిని సీత ప్రశ్నించలేదు...
జూదంలో తనని ఓడిన పాండవులను ద్రౌపదీ నిందించలేదు...
పరాయి ఆడదాన్ని అపహరించిన రావణున్ని మండోదరి మందలించలేదు...
అనుమానించిన భర్త గౌతమున్ని అహల్య రాయిని చేస్తూ శపించలేదు...
పెళ్లి అయ్యి ఇంకో అమ్మాయితో ప్రేమెంటని రుక్మిణీ కృష్ణుడిని నిలదీయాలేదు...

ఇవ్వన్నీ అప్పుడే చేసి ఉంటే ఈరోజు మీకు పరిస్థితి వచ్చేది కాదేమో... యుగాల ఆలస్యం అయ్యింది, అయినా పర్లేదు ఇప్పటికైనా తెగించి చీర కొంగు తీసి ఉరేసే తెగింపు తెచ్చుకో...

ద్రౌపదీ! ఆయుధం అందుకే శ్రీకృష్ణుడు ఇక రాడు... గోరింటాకు చేతులతో కత్తి పట్టుకో నీ చీరను నువ్వే కాపాడుకో శకుని జూదమాడుకుంట...
20/07/2023

ద్రౌపదీ! ఆయుధం అందుకే శ్రీకృష్ణుడు ఇక రాడు...
గోరింటాకు చేతులతో కత్తి పట్టుకో నీ చీరను నువ్వే కాపాడుకో శకుని జూదమాడుకుంటున్నాడు, మెదళ్లన్నీ అమ్ముడైపోతాయి...
ద్రౌపదీ! ఆయుధం అందుకో శ్రీకష్ణుడు ఇక రాడు...
ఇంకా ఎంతకాలమని వేచి చూస్తావ్? అమ్ముడైపోయిన మీడియాను ఏమని రక్షణ అడుగుతావ్? దుశ్శాసన సభలో సిగ్గులేని వారంతా నీ మానాన్ని ఏం కాపాడుతారు?
ద్రౌపదీ! ఆయుధం అందుకే శ్రీకృష్ణుడు ఇక రాడు...
నిన్నటి వరకూ రాజు గుడ్డి వాడు మాత్రమే... ఇప్పుడు చెవిటి, మూగ కూడా...
ప్రజల నోళ్లకు కుట్లు వేశారు చెవులకు కట్లు కట్టారు ఈ కన్నీళ్లు నీవేనని నువ్వే చెప్పుకో ఎవరికీ ఏం చెప్పగలం?
ద్రౌపదీ! ఆయుధం అందుకో శ్రీకృష్ణుడు ఇక రాడు...

Credit To
thanks Anna for helping me in quoting this.

చీర లాగుతుంటేనే వచ్చిన దేవుడు... నగ్నంగా ఊరేగిస్తూ ఉంటే రాలేకపోయాడా? మణిపూర్ మారణహోమం ఆగేదెప్పుడు? మనిషిని మనిషికి ఎరగా ...
20/07/2023

చీర లాగుతుంటేనే వచ్చిన దేవుడు... నగ్నంగా ఊరేగిస్తూ ఉంటే రాలేకపోయాడా?

మణిపూర్ మారణహోమం ఆగేదెప్పుడు?
మనిషిని మనిషికి ఎరగా వేసిన రాజకీయాలు ముగిసేదెప్పుడు?

మీకు తెలుసా, చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక అడవి ఉండేది... దట్టమైన, భయంకరమైన అడవి. అప్పుడు ఇక్కడ ఒక నగరం నిర్మించారు. శు...
18/07/2023

మీకు తెలుసా, చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక అడవి ఉండేది... దట్టమైన, భయంకరమైన అడవి. అప్పుడు ఇక్కడ ఒక నగరం నిర్మించారు. శుభ్రమైన ఇళ్ళు, సూటిగా గీత గీసినట్లుగా రోడ్లు, ప్రతిదీ అలా వరుసగా అయిపోయింది కానీ అడవిని నరికిన రోజు, ఆ రోజు పక్షుల గుంపు శాశ్వతంగా ఇక్కడ నుండి ఎగిరిపోయింది. తిరిగి రాకూడదని ఎగిరిపోయింది. నేను ఆ పక్షుల కోసం చూస్తున్నాను, ఎవరైనా వాటిని చూశారా? ఎవరికైనా అవి కనిపించాయ?

From of

Address

Hyderabad
500873

Telephone

919966858973

Website

Alerts

Be the first to know and let us send you an email when 24×7 Film News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to 24×7 Film News:

Share

Category